విశాఖ రాజధాని..నేను అక్కడికే షిఫ్ట్ : వైఎస్ జగన్

విశాఖ రాజధాని..నేను అక్కడికే షిఫ్ట్ :  వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో ఏపీ రాజధానిగా విశాఖ అవుతుందని చెప్పారు. తాను కూడా త్వరలో విశాఖకు షిప్ట్ అవుతున్నట్లు తెలిపారు. మార్చి నెలలో విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు జరగనుంది. ఇందుకు సంబంధించి మంగళవారం ఢిల్లీలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు సన్నాహక సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. విశాఖలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నామని జగన్ పిలుపునిచ్చారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తమ వంతు సహకారం అందిస్తామని ఇన్వెస్టర్లకు జగన్ వివరించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ గత మూడేళ్లుగా నెంబర్‌ వన్‌గా ఉంటోందని వెల్లడించారు.