
- సీఎం రేవంత్ రెడ్డికి విశారదన్ మహారాజ్ రిక్వెస్ట్
హైదరాబాద్, వెలుగు: తమ దగ్గరికి వచ్చే పేదలకు కలెక్టర్లు కనీస మర్యాద కూడా ఇవ్వటం లేదని ధర్మస్వరాజ్ పార్టీ ప్రెసిడెంట్ విశారదన్ మహారాజ్ అన్నారు. అదే టైమ్ లో పెద్ద పెద్ద నేతలను, డబ్బున్న వాళ్లను, ఖద్దర్ బట్టలతో వచ్చే నేతలను, పారిశ్రామిక వేత్తలను మాత్రం ఛాంబర్ లో కూర్చొబెట్టి మర్యాదలు చేస్తరని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
ఇదేం ద్వంద్వ నీతి అని, పేదలకు ఒక నీతి, పెద్దలకు మరో నీతా అంటూ ప్రశ్నించారు. కలెక్టరేట్లకు వచ్చే పేదల సమస్యలను కలెక్టర్లు వినేలా సీఎం ఆదేశాలు ఇవ్వాలని ఆయన సూచించారు.