అక్కడే మొదలుపెట్టాను.. బేబీ బ్యూటీ ఎమోషనల్ పోస్ట్

అక్కడే మొదలుపెట్టాను.. బేబీ బ్యూటీ ఎమోషనల్ పోస్ట్

బేబీ(Baby) సినిమా సూపర్ సక్సెస్ తో ఓవర్ నైట్ స్టార్డమ్ ను సంపాదించుకుంది లేటెస్ట్ బ్యూటీ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya). ఈ  సినిమాలో తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ మనసుతో పాటు.. ఇండస్ట్రీ దృష్టిని తన వైపుకి తిప్పుకుంది. దీంతో టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ దక్కించుకుంటోంది. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) తన తరువాతి సినిమాలో వైష్ణవీకి అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. మరో రెండు సినిమాలు కూడా లైన్లో ఉన్నాయని సమాచారం.

అయితే వైష్ణవి తాజాగా పెట్టిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైష్ణవి చైతన్య మొదట పని చేసిన నిర్మాణ సంస్థ ఇన్ఫినిటం కొత్త బ్యానర్ ను ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా ఆమె ఇన్ఫినిటం సంస్థకు అభినందనలు తెలియజేస్తూ ఒక వీడియోని షేర్ చేసింది. దానికి ఒక ఎమోషనల్ కొటేషన్ కూడా ఇచ్చింది వైష్ణవి.. నా జీవితంలో ఎన్నో మర్చిపోలేని సంఘటనలు ఉన్నాయి..  అందులో  ఇన్ఫినిటం ఒకటి. నా యాక్టింగ్ జర్నీ ఆ సంస్థలోనే మొదలైంది. అక్కడ నేను పనిచేసినప్పుడు అందరూ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. వారందరికీ నా ధన్యవాదాలు. నేను ఎంత ఎత్తుకు ఎదిగినా.. నా మూలాలను మాత్రం మర్చిపోలేనని, నా ఈ ప్రయాణంలో నాతో ఉన్న ప్రతి ఒక్కరిని ఎప్పటికీ మరచిపోను అంటూ రాసుకొచ్చింది వైష్ణవి. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.