GangsofGodavari: విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

GangsofGodavari: విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

రైటర్.. డైరెక్టర్..హీరో.. విశ్వక్ సేన్(Vishwak Sen) నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs of Godavari). ఈ మూవీ నుంచి అద్దిరిపోయే ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. సుట్టంలా సూసి పోకల..సుట్టేసుకోవే సీరలా..సక్కాని సంటి వాడిలా..సేత్తనే నువ్వు సెప్పిందంలా అంటూ యువన్ శంకర్ రాజా ట్యూన్ వినసొంపుగా ఉంది. అచ్చమైన పల్లెటూర్లో.. గొప్పింటి అమ్మాయి నేహశెట్టి(Neha Shetty)కి, సముద్రం ఒడ్డున నివసించే సాధారణ హీరోకు మధ్య ఈ  సాంగ్ రానుంది. 

హీరో విశ్వక్, హీరోయిన్ నేహా శెట్టి మధ్య కెమిస్ట్రీ చూపులతోనే చంపేసేలా కనిపిస్తోంది. ఒక మాస్ క్యారెక్టర్ కు, క్లాస్ అమ్మాయితో లవ్ సెట్ అయితే ఎలా ఉంటుందో..అలా చూపించారు మేకర్స్. హీరో కొవ్వూరు పోస్ట్ ఆఫీస్ బాక్స్ తో..పూరి గుడిసేల మధ్య హీరోయిన్ ను, మార్కెట్లో మాస్ లుక్ తో సిగెరెట్ తాగుతూ హీరో..కారులో కూర్చుని చూసే హీరోయిన్ .. ఇలా పాతకాలం నాటి రేడియో,సైకిల్ చూపిస్తూ రిలీజ్ చేసిన ప్రోమో ఆకట్టుకుంటోంది. శ్రీ హర్ష లిరిక్స్ అందించగా, అనురాగ్ కులకర్ణి పాడారు.  ఇక పూర్తి లిరికల్ సాంగ్ ను ఆగస్టు 16న రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు. 

ALSO READ :ఏ స్టార్ హీరోయిన్ అలా చేయదు.. శ్రీలీలపై నాగశౌర్య కామెంట్స్ వైరల్

అలాగే రీసెంట్ గా ఏ మూవీ నుంచి రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ విశ్వక్ డైలాగ్స్ తో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది..అన్న..మేం గోదారోళ్లం..మాటోకటే సాగదీస్తాం..తేడాలోస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం.. అంటూ  విశ్వక్ సేన్ పవర్ఫుల్ రోల్ డైలాగ్ మూవీపై హైప్ పెంచుతోంది. డైరెక్టర్ కృష్ణ చైతన్య(Krishna Chaitanya) లిరిక్ రైటర్ గా సినిమా కెరీర్ ను స్టార్ట్ చేసి రౌడీ ఫెలో,చల్ మోహన్ రంగా వంటి మూవీస్ తో డైరెక్టర్ గా తనలోని టాలెంట్ ను నిరూపించుకున్నారు. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో తనలోని వర్శటాలిటీని చూపించబోతున్నారు. హీరో విశ్వ క్ సేన్ రీసెంట్ మూవీ దాస్ కా దామ్కి మూవీతో సక్సెస్ అందుకున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రీకర స్టూడియోస్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించనున్నారు.