విశ్వకర్మ పథకం కుల వృత్తుల వారికి ఓ కొత్త ఆశాకిరణం: ప్రధాని మోదీ

విశ్వకర్మ పథకం కుల వృత్తుల వారికి ఓ కొత్త ఆశాకిరణం: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ‘పీఎం విశ్వకర’ (PM Vishwakarma Yojana) పథకాన్ని ప్రారంభించారు. ఢిల్లీ(Delhi)లో ద్వారకలోని ‘ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్’ (ఐఐసీసీ)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన కళాకారులకు, నిపుణులకు ‘పీఎం విశ్వకర్మ’ సర్టిఫికెట్లను అందజేశారు ప్రధాని. ఇదే సమయంలో ‘యశోభూమి’(ఐఐసీసీ)ని కూడా జాతికి అంకిత చేశారు ప్రధాని మోదీ. 

పీఎం విశ్వకర్మ  పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ.. విశ్వకర్మ పథకం కుల వృత్తుల వారికి ఓ కొత్త ఆశాకిరణమన్నారు. విశ్వకర్మ జయంతిని.. భారత సాంప్రదాయ కళాకారులు, నిపుణులకు అంకితం చేయడం జరిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశప్రజలందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. విశ్వకర్మ భగవానుని ఆశీస్సులతో నేడు ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనను ప్రారంభించినట్లు తెలిపారు. చేతి వృత్తి కళాకారులు, హ్యాండ్ స్కిల్స్, టూల్స్‌తో పనిచేస్తున్న లక్షలాది కుటుంబాలకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కొత్త ఆశాకిరణంగా నిలుస్తుందన్నారు ప్రధానిమోదీ.