
చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట రూపొందిస్తున్న సోషీయో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేశారు. తాజాగా సోమవారం నుంచి కొత్త షెడ్యూల్‌ను తిరిగి హైదరాబాద్‌లో మొదలుపెడుతున్నారు.
సిటీలోని డిఫరెంట్ లొకేషన్స్‌లో యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేయబోతున్నారట. ఇది ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే సీన్ అని తెలుస్తోంది. అలాగే చిరంజీవి, త్రిషతో పాటు ఇతర నటీనటులపై ఇంపార్టెంట్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందులో చిరంజీవి డ్యూయెల్ రోల్ చేస్తున్నారని, అందులో ఒకటి యంగ్ లుక్ కాగా, వయసు పైబడిన మరో పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. సురభి, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, ప్రవీణ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానుంది.