
కాంగ్రెస్ పార్టీతో కాకా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు వివేక్ సైనిక్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాలకోటి సత్యనారాయణ. హైదరాబాద్ హైదర్ గూడ NSSలో సైనిక్ ఫౌండేషన్ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో వివేక్ వెంకటస్వామి కీలక పాత్ర పోషించారని చెప్పారు. అంబేద్కర్ విద్యాసంస్థలు నెలకొల్పి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని గుర్తు చేశారు.
విశాక ఫౌండేషన్ తో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నరని చెప్పారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో వివేక్ వెంకటస్వామికి అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు వివేక్ సైనిక్ ఫౌండేషన్ సభ్యులు.