తలసేమియాను ఆరోగ్యశ్రీలో చేర్చండి : వివేక్ వెంకటస్వామి

తలసేమియాను  ఆరోగ్యశ్రీలో చేర్చండి : వివేక్ వెంకటస్వామి
  • హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహకు వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యశ్రీలో తలసేమియా వ్యాధిని చేర్చాలని హెల్త్ మినిస్టర్ దామెదర రాజనర్సింహను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారు. బుధవారం ఈ మేరకు సెక్రటేరియెట్‌‌లో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. తలసేమియాను ఆరోగ్యశ్రీలో చేరిస్తే లక్షల మందికి మేలు జరుగుతుందని చెప్పారు. హాస్పిటల్ బిల్స్ కట్టలేక చాలా మంది ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.

అలాగే, చెన్నూరులోని ప్రభుత్వ హాస్పిటల్‌‌లో వైద్య సిబ్బందిని పెంచాలని మంత్రిని కోరారు. ఓపీ ఎక్కువగా ఉండటం, సిబ్బంది తక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రికి వివరించారు. ఈ అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారని, ఉన్నతాధికారులతో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వివేక్ వెంకటస్వామి తెలిపారు.