బాల్క సుమన్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి.. జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు: మంత్రి వివేక్

బాల్క సుమన్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి.. జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు: మంత్రి వివేక్

మంచిర్యాల జిల్లా కోటపల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ. సోమవారం ( జూన్ 1 ) జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ బాల్క సుమన్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. బాల్క సుమన్ కావాలనే మిలిటెంట్ ఉద్యమాలు చేయాలని  ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని.. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. అందుకే జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడని అన్నారు మంత్రి వివేక్.

సర్ ప్రక్రియను కాంగ్రెస్ బీఎల్వోలు పాల్గొని ప్రతీ ఓటరును కలిసి వారి వివరాలు పొందుపరచాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణ ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు కోసమే ఈ ప్రక్రియను చేపట్టి ఓట్లను తొలగిస్తుందని అన్నారు. కేవలం వారికి అనుబంధ ఓట్లను మాత్రమే ఉంచి ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారని అన్నారు మంత్రి వివేక్. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే ప్రతి బీఎల్వో ఖచ్చితంగా పని చేసి ఓటర్ల పేర్లను సరి చూడాలని అన్నారు.

చెన్నూరు నియోజకవర్గంలో విద్యా వైద్యానికి పెద్దపీట వేసి అభివృద్ధి చేయడం జరుగుతుందని... చెన్నూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామని అన్నారు.