
రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు వివిక్షకు గురవుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. తెలంగాణ వస్తే బాగుపడుతామనుకున్న దళితులు అణిచివేతకు గురవుతున్నారని మండిపడ్డారు. దళితులకు మూడెకరల భూమిని ఇస్తానని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని వివేక్ ఆరోపించారు. నాంపల్లిలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం లక్ష ఇళ్లను మాత్రమే ఇచ్చిందన్నారు. యూపీ సర్కార్ 50 లక్షల ఇళ్లను నిర్మించి పేదలకు ఇచ్చిందని చెప్పారు.
అంబేద్కర్ ను సీఎం కేసీఆర్ అవమానించారని జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్య. దళితులంటే కేసీఆర్ కు చిన్న చూపని విమర్శించారు. పార్టీని బూత్ స్థాయి నుంచి పటిష్టం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు ఎస్సీ, ఎస్టీలను పట్టించుకోలేదన్నారు.