బాల్కసుమన్కు ప్రతీ పనిలో 30 శాతం కమీషన్ కావాలె: వివేక్ వెంకటస్వామి

బాల్కసుమన్కు ప్రతీ పనిలో 30 శాతం కమీషన్ కావాలె: వివేక్ వెంకటస్వామి

బాల్కసుమన్ కు ప్రజా సమస్యలు పట్టవని.. ప్రతీ పనిలో 30 శాతం కమీషన్  కావాలన్నారు  కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం సుద్దాల గ్రామంలో వివేక్ వెంకటస్వామి రోడ్ షో నిర్వహించారు.   పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ లేవు కానీ.. ముఖ్యమంత్రి మహల్ లాంటి ప్రగతి భవన్ కట్టుకున్నారని విమర్శించారు. బంగారు తెలంగాణ కాదు బంగారు కుటుంబం అఅయ్యిందన్నారు.  పెద్ద పెద్ద బిల్డింగ్ లు కట్టిన సొమ్మంతా జనం సొమ్మేనన్నారు. 

 కేసీఆర్ కుటుంబ సభ్యుల ఫాంహౌజ్ ల పై రేవంత్ రెడ్డిని నిలదీస్తే జైల్లో వేశారని విమర్శించారు.  కేసీఆర్ తన సొంతూరు చింతమడకలో అందరికీ డబులు బెడ్రూం  ఇండ్లు ఇచ్చారని..   చెన్నూరులో ఎందుకు  ఇవ్వలేదని ప్రశ్నించారు.  చెన్నూరు ప్రజలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు.  ఏ ఒక్క పని కోసం చెన్నూరు ప్రజలు బాల్కసుమన్ దగ్గరికి పోయినా కలిసే అవకాశం ఇవ్వరన్నారు. ఏ ఊర్లో మంచినీళ్లు రావడం లేదన్నారు.    తాను  ఓడినా ప్రజల్లోనే  ఉన్నానని చెప్పారు. కేసీఆర్..బాల్కసుమన్ కు అభివృద్ధి  అవసరం లేదని..ప్రతీ పనిలో కమీసన్ కావాలన్నారు.

చెన్నూరులో కాంగ్రెస నుంచి వివేక్ వెంకటస్వామి ప్రచారం చేస్తుండగా.. బీజేపీ నుంచి దుర్గం అశోక్.. బీఆర్ఎస్ నుంచి బాల్కసుమన్ పోటీ చేస్తున్నారు.  కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ప్రచారంలో దూసుకుపోతున్నరు.