మాలల అభివృద్ధికి కాక వెంకటస్వామి ఎంతో కృషి చేశారు: వివేక్ వెంకటస్వామి

మాలల అభివృద్ధికి కాక వెంకటస్వామి ఎంతో కృషి చేశారు: వివేక్ వెంకటస్వామి

మాలల అభివృద్ధికి కాక వెంకట స్వామి, ఈశ్వర్ బాయ్ ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకోని అందరూ ముందుకు వెళ్లాలని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో మాలలు ఉండాలని.. బత్తుల శ్యామ్ సుందర్ ఐక్యరాజ్య సమితిలో మాలల సమస్యల కోసం మాట్లాడాడని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రతి పథకంలో మాదిగలు లబ్ధి పొందారని.. అన్ని రంగలలో మాల కులస్తులు ఉండాలని కోరారు.

రాష్ట్రంలో మాలలు ఏకం కావాలని కోరారు. సమాజంలో మాల కులస్తులలో ఐక్యత లేదని.. వాళ్లు జనాభాపరంగా తక్కువ అని ప్రచారం అవుతుందన్నారు. గతంలో మాల అని చెప్పుకొనే వాళ్లు కాదని... ఇప్పుడు చెప్పుకుంటున్నారని వివరించారు.

హైదరాబాద్ చంపాపేట్ లోని మందా యాదవ రెడ్డి గార్డెన్ లో జాతీయ మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మాలల అలయ్ బలయ్ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెన్నురు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, అంబేద్కర్ రాష్ట్రీయ ఏక్తా మంచ్ జాతీయ అధ్యక్షుడు భవన్ నాత్ పాశ్వాన్, రాష్ట్ర అధ్యక్షుడు కర్ణం కిషన్, వివిధ జిల్లాల మాల సంఘాల నేతలు పాల్గొన్నారు.