దేశం మొత్తం బీజేపీ వైపు చూస్తోంది

V6 Velugu Posted on Apr 08, 2021

టీఆర్ఎస్, టీడీపీ, నుండి బీజేపీలోకి వలసలు రావడం సంతోషకరమన్నారు ఆ పార్టీ  కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకట స్వామి. సిద్దిపేటలో  బీజేపీ కార్యాలయంలో పలువురు ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్ ..దేశం మొత్తం ఇపుడు బీజేపీ వైపు చూస్తోందన్నారు. వరదలకు హైదరాబాద్ అతలాకుతలం అవుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారన్నారు. సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ని కూడా రిటైర్డ్ అయిన అధికారిని నియమించి అవినీతికి పాల్పడుతున్నారన్నారు. బీజేపీ తరఫున వచ్చే నిధులను  వాడుకుంటున్నారు, కానీ ప్రచారం చేయడం లేదన్నారు. ప్రధాన మంత్రి ఫోటో పెట్టాలిసి వస్తుందని పథకాలను ప్రజలకు చేరనియ్యడం లేదన్నారు. కేంద్ర అమృత పతాకం కింద రూ. 250 కోట్లు సిద్దిపేట పట్టణానికి  వచ్చాయన్నారు. 

Tagged TDP

Latest Videos

Subscribe Now

More News