హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఎకనామిక్స్ రిఫామ్స్ తోనే ప్రజలకు లబ్ది జరిగిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మన్మోహన్ సింగ్ హయాంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి పబ్లిక్ సెక్టార్ లో విప్లవాత్మక మార్పులు తెచ్చి పరిశ్రమలు స్థాపించిందే కాంగ్రెస్ అన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చేందుకే కేంద్రం కుట్ర చేస్తుందన్నారు. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం సరికాదన్నారు.
రాష్ట్రంనుంచి కేంద్రానికి రూపాయి పన్నుల రూపంలో వెళితే.. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది కేవలం పదిపైసలే అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఉపాధి హామీ పథకంలో కేంద్రం ఇచ్చే నిధుల వాటాను తగ్గించడం ద్వారా ఆ పథకాన్ని నీరేగార్చుతుందన్నారు.. దీంతో పేదలకు తీవ్ర నష్టం కలుగుతున్నారు. ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపులో రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు.
దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్లిన నెహ్రూ బీజేపీ విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. దేశంలో మతసామరస్యం కాంగ్రెస్ హయాంలోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ అన్ని మతాలను సమానంగా చూస్తుందన్నారు. జనవరి 5 నుంచి కేంద్రానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భం గా హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో గాంధీ, నెహ్రూ , పటేల్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళి అర్పించారు మంత్రులు పొన్న ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, అజారుద్దీన్.
