సొంత రాష్ట్రంలోనూ ఆంధ్రా కాంట్రాక్టర్ల హవా

సొంత రాష్ట్రంలోనూ ఆంధ్రా కాంట్రాక్టర్ల హవా

ప్రత్యేక రాష్ట్రంలోనూ ఆంధ్ర కాంట్రాక్టర్ల హవా కొనసాగుతోందన్నారు మాజీ ఎంపీ, రాష్ట్ర బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతో మంది చనిపోయారన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుందామన్నారు కానీ ఇప్పుడు మాట మార్చారన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారంగా వ్యవహరిస్తున్నారన్నారు. రజాకార్లు తెలంగాణ ప్రజలపై అనేక దాడులు చేశారన్నారు. అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. ఆంధ్ర పాలకులు నిర్వహించట్లేదని ఉద్యమ సమయంలో విమర్శించిన కేసీఆర్, ఇప్పుడెందుకు నిర్వహించట్లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి జన్మదిన శుభాకాంక్షలు మోడీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.