బెల్లంపల్లిలో టీఆర్ఎస్ భూ అక్రమాలను బయటపెడతాం

బెల్లంపల్లిలో టీఆర్ఎస్ భూ అక్రమాలను బయటపెడతాం

అవినీతి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రజలు అనుకుంటున్నారని బీజేపీ జాతీయ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సుమారు 150మంది  వివేక్ వెంకటస్వామి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. కేటీఆర్పై రైతు చెప్పు విసిరడంతో ప్రజల తిరుగుబాటు మొదలైందని..కేసీఆర్ ప్రజలను హింసించే సీఎం అని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లను మోడీ ప్రభుత్వం నిర్మించిందని చెప్పారు. దళితుడిని కేసీఆర్ ముఖ్యమంత్రి చేయలేదు కానీ ఒక దళితుడిని, గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేస్తున్న ఘనత మోడీకే దక్కుతుందన్నారు.  నాయకులు, కార్యకర్తలకు ఎప్పటికి అండగా ఉంటారని..పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న భూఅక్రమాలను బయటపెడతామని స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్ లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల ను విజయవంతం చేయాలని వివేక్ పిలుపునిచ్చారు.