చైనా స్మార్ ట్ ఫోన్ మేకర్ వివో తన లేటెస్ట్ స్మార్ ట్ ఫోన్‌వై17ను శనివారం ఇండియా మార్కె ట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.17,990. ఇది మినరల్ బ్లూ,మిస్టిక్ పర్పుల్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ , అమెజాన్ , పేటీఎం, వివో ఈ–స్టోర్ నుంచి దీనిని కొనుక్కోవచ్చు. మొబైల్ ఎక్స్‌చేంజ్ ద్వారా కొంటే అదనంగా రూ.వెయ్యి డిస్కౌంట్ ఇస్తారు. వివోవై17లో 6.35 ఇంచుల స్క్రీన్ , మీడియాటెక్ హీలియోపీ35 ప్రాసెసర్ , 20 ఎంపీ ఫ్రంట్ కెమెరా, వెనుక మూడుకెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీబీ ర్యామ్ ,128 జీబీ స్టోరేజీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
