రాష్ట్రంలో వందేళ్లు మన ప్రభుత్వమే ఉండాలని అమ్మ కోరిక

రాష్ట్రంలో వందేళ్లు మన ప్రభుత్వమే ఉండాలని అమ్మ కోరిక
  • ఇది అమ్మ కోరిక.. వీకే శశికళ

చెన్నై: ‘తమిళనాడులో మరో వందేళ్లు మన ప్రభుత్వమే ఉండాలని అమ్మ(జయలలిత) కోరుకున్నారు. ఆమె కోరికను నెరవేర్చడం కోసమన్నా డీఎంకే మా పార్టీ(ఏఎంఎంకే)తో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలి. ఈ విషయంపై తర్వలోనే నేను ప్రజలను, పార్టీ కేడర్ ను కలుస్తా’ అని జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ చెప్పారు. తమిళనాడు మాజీ సీఎం, అన్నా డీఎంకే మాజీ చీఫ్ జయలలిత 73వ జయంతి సందర్భంగా బుధవారం శశికళ నివాళి అర్పించారు. జయ మరణం తర్వాత అన్నా డీఎంకే చీఫ్​గా పదవి చేపట్టిన శశికళ ఆ తర్వాత కరప్షన్ కేసులో జైలు పాలవడంతో ఆమెను పళనిస్వామి, పన్నీర్ సెల్వం పార్టీ నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో ఇటీవల జైలు నుంచి విడుదలైన శశికళ తిరిగి పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు.

పార్టీ నేతల నివాళులు..

చెన్నైలోని అన్నా డీఎంకే హెడ్ ఆఫీసులో జయలలిత విగ్రహానికి పార్టీ నేతలు చీఫ్​మినిస్టర్ పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జయ సన్నిహితురాలు, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) నేత వీకే శశికళ, టీటీవీ దినకరన్, తదితరులు ఆమెకు నివాళులు అర్పించారు. పార్టీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ క్యాంపులు, ఇతర కార్యక్రమాలను చేపట్టారు.

For More News..

ఇంటి పనికి భార్యకు జీతమివ్వాల్సిందే.. కోర్టు సంచలన తీర్పు