రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2021 లో భారత్ లో పర్యటించనున్నారు. వచ్చే ఏడాది మొదటి ఆరునెలలో పుతిన్ పర్యటించనున్నారని భారత్ లోని రష్యా కార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది చివరలో పుతిన్ భారత్ రావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వాయిదా పడినట్లు తెలిపింది. అక్టోబర్ లో భారత్ రష్యా మధ్య సమ్మిట్ జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా సదస్సును వాయిదా వేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయని రష్యా రాయబారి నికోలమ్ కుదాషెవ్ తెలిపారు. భారత్ ,రష్యా మధ్య రాజకీయ,ఆర్థిక పరమైన చర్చల్లో ఎటువంటి ఇబ్బంది లేదన్నారు.
