కొంత మందికి బస్సు, కారుల్లో ప్రయాణం చేస్తుంటే.. వాంతులు, వికారం, తల తిరగడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అదే ఘాట్ రోడ్డు ప్రయాణమైతే ఇక అసలు చెప్పనవసరం లేదు. మావాళ్ల కాదు బాబోయ్ అని భయపడేవాళ్లు చాలా మందే ఉంటారు. అయితే ప్రయాణంలో వాంతులు కావడానికి కారణం.. మోషన్ సిక్ నెస్. మన చర్మం, కళ్లు, చెవుల నుండి కొన్ని వైబ్రేషన్ సిగ్నల్స్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్‌కు వెళ్తాయి. ఇవి బ్రెయిన్‌ని కన్ఫ్యూజ్ చేసి మోషన్ సిక్నెస్కి కారణం అవుతాయి. అంటే వాంతులు, వికారం వంటివి. ఇలా జరగకుండా ఉండాలంటే...
- మోషన్ సిక్‌నెస్ ప్రాబ్లం ఉన్నవాళ్లు ఖాళీ కడుపుతో ట్రావెల్ చేస్తే వాంతులు అవ్వవు అనుకుంటుంటారు. కానీ అది తప్పు. అలా చేస్తే నీరసం వస్తుంది. అందుకే ఎక్కువ తినొద్దు, తినకుండా ఉండొద్దు. అలాగే మోషన్ సిక్‌నెస్ ఉన్నవాళ్లు ట్రావెలింగ్‌లో పుస్తకాలు పట్టకపోవడం మంచిది.
- వేగించిన లవంగాల పొడిలో కొంచెం చక్కెర లేదా నల్ల ఉప్పుతో కలిపి తింటే వాంతులు అవ్వవు.
- జర్నీలో తులసి ఆకులు నమిలితే కూడా వాంతులు కావు. అలాగే నిమ్మరసంలో పుదీన కలిపి జర్నీ మధ్యలో అప్పుడప్పుడు తాగాలి. పండిన నిమ్మకాయ తొక్కను వాసన చూస్తే వాంతులు ఆగుతాయి.
- ఈ ప్రాబ్లం ఉన్నవాళ్లు పెద్ద వెహికిల్స్‌లో వెళ్తే వెనుక సీట్‌లో అస్సలు కూర్చోకూడదు. ఎందుకంటే కుదుపులు వల్ల ఎక్కువ స్పీడ్‌లో వెళ్తున్న ఫీల్ వస్తుంది. దానివల్ల తల తిరిగి వాంతులు అవుతాయి.
