- రాజకీయ పార్టీల నేతలతో కమిషనర్ సమావేశం
హైదరాబాద్, వెలుగు : ప్రచార సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాల కోసం పర్మిషన్తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ సూచించారు. సోమవారం బల్దియా హెడ్డాఫీసులో సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డితో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోనాల్డ్రోస్మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా పార్టీల నేతలు కృషి చేయాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు.
సభలు, సమావేశాలకు 48 గంటల ముందు సువిధ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికే అనుమతి ఉంటుందని, మ్యానువల్ గా అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీలు లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 1950, 1800-599-2999 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.
లైసెన్స్ వెపన్స్ ఉంటే డిపాజిట్ చేయాలన్నారు. హైదరాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్అనుదీప్ దురిశెట్టి, సికింద్రాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్హేమంత్ కేశవ్ పాటిల్, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, ఈవీడీఎం ప్రకాశ్‌రెడ్డి, ఎన్నికల విభాగం అడిషనల్ కమిషనర్ అలివేలు మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.
