3 రాష్ట్రాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

3 రాష్ట్రాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. యూపీ, ఉత్తరాఖండ్, గోవాలోని మొత్తం 165 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న 36,823 కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహించారు. ఉత్తర్ ప్రదేశ్లో రెండో దశ ఎన్నికల్లో 60.44 శాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.  గోవాలో 78.94శాతం, ఉత్తరాఖండ్లో 62.5శాతం ఓట్లు పోలయ్యాయి. 

ఉత్తర్ ప్రదేశ్ లో 9 జిల్లాల పరిధిలోని 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 586 మంది బరిలో ఉన్నారు. 2017 ఎన్నికల్లో ఈ 55 సీట్లలో బీజేపీ 38 స్థానాలు గెలుచుకోగా.. సమాజ్వాదీ పార్టీ  15 స్థానాల్లో విజయం సాధించింది. గోవాలో 40 స్థానాలు, ఉత్తరాఖండ్లో 13 జిల్లాలోని 70 అసెంబ్లీ సీట్లకు ఇవాళ ఎన్నిక జరిగింది.

మరిన్ని వార్తల కోసం..

కేసీఆర్ బర్త్ డే సందర్భంగా మూడు రోజులు ఘనంగా సంబరాలు

మోటార్లకు మీటర్లు పెడితే కేసీఆర్ కు మీటర్ పెడ్తం