25 నుంచి వీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏల నిరవధిక సమ్మె 

25 నుంచి వీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏల నిరవధిక సమ్మె 
  • వీఆర్వో జేఏసీ ప్రకటన 

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులను బహిష్కరిస్తున్నట్లు వీఆర్వో సంఘాల జేఏసీ ప్రకటించింది. వీఆర్వో వ్యవస్థ రద్దయి 22 నెలలు గడిచినా రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేగంపేటలో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘాల నాయకుల సమావేశం శుక్రవారం జరిగింది. జేఏసీ నాయకులు గోల్కొండ సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సుధాకర్ రావు మాట్లాడారు.

సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఎన్నిసార్లు సమస్య విన్నవించినా లాభం లేకుండా పోయిందన్నారు. సీఎస్ సోమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసేందుకు 22 నెలలుగా అపాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అడుగుతున్నా, ఇవ్వట్లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో విధి నిర్వహణలో 200 మంది వీఆర్వోలు చనిపోయారని, ఇప్పుడు వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం అమానుషమన్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దు చేయడంతో పాటు భూములకు సంబంధించిన విధులను వీఆర్వోలు నిర్వహించొద్దని సీఎం కేసీఆర్ ఆదేశాలివ్వడంతో సదస్సులను బహిష్కరించాలని నిర్ణయించామన్నారు. 

25 నుంచి వీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏల నిరవధిక సమ్మె 

పే స్కేల్ వర్తింపజేయాలనే డిమాండ్​తో ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు వీఆర్ఏ సంఘాల జేఏసీ తెలిపింది. వీఆర్ఏలుగా పనిచేస్తూ వృద్ధులైన, చనిపోయినోళ్ల పిల్లలకు ఉద్యోగాలివ్వాలనే డిమాండ్లతో సీసీఎల్ఏ ఆఫీసులో జేఏసీ నాయకులు శుక్రవారం సమ్మె నోటీసు ఇచ్చారు.