DC vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్కతా.. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ గెలుస్తుందా..?

DC vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్కతా.. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ గెలుస్తుందా..?

ఐపీఎల్ 2026లో భాగంగా జరుగుతున్న 51వ మ్యాచ్ లో ఢిల్లీ వర్సెస్ కోల్ కతా తలపడుతున్నాయి. మే 08న ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వరసు ఓటములతో సతమవుతున్న రెండు టీమ్స్.. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే కసితో ఉన్నాయి. 

కోల్ కతా ప్లే ఆఫ్ చేరుకునేందుకు ఇంకా 5 గేమ్స్ మిగిలి ఉన్నాయి. దీంతో.. ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ రేస్ లో ముందుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది.

ఇక ఢిల్లీ విషయానికి వస్తే.. కన్సిస్టెన్సీ లేక చివరికి హోమ్ గ్రౌండ్ లో కూడా అట్టర్ ఫ్లాప్ అవుతూ వస్తోంది. పాయింట్స్ టేబుల్ లో ఎనిమిదో ప్లేస్ లో ఉన్న ఢిల్లీ..  ప్లే ఆఫ్ రేస్ లో ఉండాలంటి మిగిలిన నాలుగు మ్యాచ్ లు గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. 


KKR తుది జట్టులో ఎటువంటి మార్పులూ లేకుండా బరిలోకి దిగుతోంది. అంటే ఈ మ్యాచ్ లో కూడా  రూ. 18 కోట్ల ఆటగాడు మతీశ పతిరానను పక్కన పెట్టింది.  మరోవైపు, DC రెండు మార్పులతో ఆడుతోంది. ముఖేష్ కుమార్, విప్రాజ్ నిగమ్ తిరిగి జట్టులోకి వచ్చారు.

టీమ్స్:

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): 

అజింక్య రహానే(సి), అంగ్ క్రిష్ రఘువంశీ(w), కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగి, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి


ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): 

పాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్(w), నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(సి), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, లుంగి ఎన్గిడి, ముఖేష్ కుమార్

 ఇంపాక్ట్ సబ్స్:

KKR ఇంపాక్ట్ సబ్స్: రమణదీప్ సింగ్, ఫిన్ అలెన్, తేజస్వి దహియా, నవదీప్ సైనీ, టిమ్ సీఫెర్ట్.

DC ఇంపాక్ట్ సబ్స్: కరుణ్ నాయర్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, అభిషేక్ పోరెల్, డేవిడ్ మిల్లర్