
మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘వృషభ’. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీపై అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. నంద కిషోర్ దర్శకత్వంలో కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిలిమ్స్‌తో కలిసి అభిషేక్ వ్యాస్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మంగళవారం ఈ మూవీ టీజర్ అప్‌డేట్‌ను అందించారు మేకర్స్. ఈనెల 18న టీజర్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ‘యుద్ధాలు, భావోద్వేగాలు, గర్జన’ అంటూ మోహన్‌లాల్ ట్వీట్ చేస్తూ ఈ అప్‌డేట్‌ను పోస్ట్ చేయడం టీజర్‌పై ఆసక్తిని పెంచుతోంది.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో త్రిశూలం ఆకారంలో ఉన్న కత్తి పట్టుకొని ఇంటెన్స్ లుక్‌లో యోధుడిగా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు మోహన్ లాల్. మైథాలజీతో పాటు యాక్షన్, డ్రామా, సస్పెన్స్ ఇలా అన్నికమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మోహన్ లాల్ నట విశ్వరూపాన్ని చూస్తారని మేకర్స్ చెప్పారు. తెలుగు, మలయాళం భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమా రిలీజ్ కానుంది.