హైదరాబాద్​లో వీఎక్స్​ఐ గ్లోబల్‌ ఆఫీస్​

హైదరాబాద్​లో వీఎక్స్​ఐ గ్లోబల్‌ ఆఫీస్​

హైదరాబాద్:  బిజినెస్ ప్రాసెస్ అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ ప్లేయర్ వీఎక్స్​ఐ గ్లోబల్ సొల్యూషన్స్ ఇండియాలో అడుగుపెట్టింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన తూర్పు ఆసియా ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ఆఫీసును ప్రారంభించింది.  దీని ద్వారా కంపెనీ రాబోయే ఐదేళ్లలో 10 వేల మందిని నియమించుకోనుంది.  

ఇక్కడ వెయ్యి మంది పనిచేయవచ్చు. ఈ సైట్​ను  తెలంగాణ ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. వీఎక్స్​ఐ గ్లోబల్ ఇప్పటికే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 200 మందిని నియమించుకుంది. హైదరాబాద్ సైట్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ, మీడియా, బ్యాంకింగ్  ఫైనాన్షియల్ సర్వీసెస్ ,  రిటైల్ వంటి రంగాలకు ఇది సేవలను అందిస్తుంది.