హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీఎక్స్​ఐ ఆఫీస్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీఎక్స్​ఐ ఆఫీస్

హైదరాబాద్: బైన్ క్యాపిటల్ యాజమాన్యంలోని వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ హైదరాబాద్​లో డెలివరీ సెంటర్​ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. దీని ద్వారా 10 వేల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్​తో భేటీ అనంతరం వీఎక్స్​ఐ గ్లోబల్ సొల్యూషన్స్ గ్లోబల్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ ఎరికా బోగర్ కింగ్ ఈ విషయం తెలిపారు. గత తొమ్మిదేళ్లలో తెలంగాణ పెట్టుబడుల కేంద్రంగా ఎలా మారిందో ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు. పరిశ్రమలకు అనుకూల విధానాలు, మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి ఉండటం వల్ల తెలంగాణ.. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులను ఆకర్షిస్తోందని అన్నారు.

1998లో ఏర్పాటైన వీఎక్స్​ఐ గ్లోబల్ సొల్యూషన్స్​కు ఉత్తర అమెరికా, ఆసియా, యూరప్, కరేబియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 42కిపైగా నగరాల్లో 40 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇది ప్రముఖ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు కస్టమర్ ఎక్స్​పీరియన్స్​ సొల్యూషన్స్​ను అందిస్తోంది. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ జయేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రంజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, తెలంగాణ డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా వింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొణతం దిలీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆత్మకూరి తదితరులు పాల్గొన్నారు.