కామారెడ్డి సైన్స్ ఫెయిర్లో సత్తా చాటిన వనపర్తి స్టూడెంట్

 కామారెడ్డి  సైన్స్ ఫెయిర్లో సత్తా చాటిన వనపర్తి స్టూడెంట్

వనపర్తి, వెలుగు: కామారెడ్డిలో నిర్వహించిన స్టేట్​ లెవెల్​ సైన్స్​ ఫెయిర్​లో వనపర్తి జడ్పీ హైస్కూల్​కు చెందిన స్టూడెంట్​ స్టేట్​ లెవెల్​లో రెండో స్థానంలో నిలిచాడు. స్థానిక జడ్పీ బాయ్స్​హైస్కూల్​లో చదువుతున్న ఉమర్​ సిద్దిఖి వర్షపు నీటి పునర్వినియోగం అనే అంశంపై గైడ్​ టీచర్​ కె. నరేశ్​కుమార్​ పర్యవేక్షణలో ప్రదర్శన ఇచ్చాడు.

అధికారులు ఈ ప్రాజెక్టుకు రెండో బహుమతి ప్రకటించారు. ఆదివారం ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఉమర్​ సిద్దిఖిని సన్మానించగా, హెచ్ఎం శివాజీ, టీచర్లు అతడిని అభినందించారు.