పేదల ముంగిట్లోకి సంక్షేమ పథకాలు

పేదల ముంగిట్లోకి సంక్షేమ పథకాలు
  • ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక సమావేశాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు

వెలుగు, నెట్​వర్క్​ :   రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్​ పాలనలో  ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను  ప్రభుత్వం అమలు చేస్తోందని, రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సంక్షేమ పథకాలను పేదలకు చేరవేస్తున్నామని కాంగ్రెస్​ మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పారు. ఉమ్మడి మహబూబ్​నగర్​, మెదక్​, నల్గొండ జిల్లాలోని నియోజకవర్గాల్లో శనివారం  ప్రజా పాలనా–ప్రగతి ప్రణాళిక సమావేశాలను నిర్వహించారు. 
సంగారెడ్డిలో : ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్యతో పాటు ఉచిత సమగ్ర వైద్య సేవలను అందించడమే  మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సంగారెడ్డి జిల్లా నియోజకవర్గ స్థాయి సమావేశం శనివారం జోగిపేటలో నిర్వహించారు.  జిల్లా స్థాయిలోనే 90 శాతం వైద్య సేవలు అందించేలా ఆధునిక  రూ.200 కోట్లతో సదుపాయాలు విస్తరిస్తున్నామన్నారు. అలాగే..  సింగూర్ లైన్ పనులు చేపట్టామని  ెలిపారు.  

నల్గొండలో..  నిరుద్యోగ యువతకు   ఉద్యోగ అవకాశాలు కల్పించడమే  లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా  నల్గొండ జిల్లా కేంద్రంలోని న్యాక్ లో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు.   5వేల  మందికి ఉద్యోగ  అవకాశాలు కల్పించాలని కంపెనీలను కోరారు. అనంతరం  ఉదయాధిత్య భవన్లో    నియోజకవర్గస్థాయి  సమావేశానికి మంత్రి హాజరయ్యారు.   

దేశంలో ఎక్కడా లేనివిధంగా పూర్వ ప్రాథమిక విద్య నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వపరంగా మధ్యాహ్న భోజనం అందించనుందని తెలిపారు.   జూన్ నుంచి మరో విడత ఇందిరమ్మ ఇండ్లు పొందేందుకు అనుమతి వస్తుందని, అందువల్ల మే చివరినాటికి నిర్మాణం చేపట్టిన ఇండ్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.   

భువనగిరి  ఎంపీ  చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​ కుమార్​ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న ,   భువనగిరి నియోజకవర్గాల్లో , తుంగతుర్తిలో ఎమ్మెల్యే మందుల సామెల్​, దేవరకొండలో ఎమ్మెల్యే నేనావత్​ బాలునాయక్​ , వనపర్తిలో ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి, కల్వకుర్తిలో ఎమ్మెల్యే ---ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి , మహబూబ్​నగర్​లో యెన్నం శ్రీనివాస్​ రెడ్డి    నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక @ 99 రోజుల అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు.