ప్రింటింగ్ ప్రెస్ లో  నకిలీ  సర్టిఫికెట్లు, రబ్బర్ స్టాంపులు

 ప్రింటింగ్ ప్రెస్ లో  నకిలీ  సర్టిఫికెట్లు, రబ్బర్ స్టాంపులు

అయిజ, వెలుగు: పట్టణంలోని లక్ష్మీనరసింహ ప్రింటింగ్ ప్రెస్‌‌‌‌లో  నకిలీ ధ్రువపత్రాలు, రబ్బర్ స్టాంపులు తయారు చేస్తున్న వ్యవహారాన్ని శనివారం రెవెన్యూ అధికారులు గుట్టురట్టు చేశారు. తహసీల్దార్ జ్యోతి ఆదేశాలతో ఆర్ఐ రజనీకాంత్ రెడ్డి సిబ్బందితో కలిసి ప్రింటింగ్ ప్రెస్‌‌‌‌పై దాడి చేశారు.   అయిజ, గట్టు మండలాల  గ్రామాల సర్పంచులు, హెడ్మాస్టర్లు, ప్రభుత్వ వైద్యుల పేర్లతో తయారు చేసిన నకిలీ రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఆ స్టాంపుల ఆధారంగా మ్యారేజ్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు, మెమోలు తదితర నకిలీ ధృవపత్రాలను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

 కంప్యూటర్‌‌‌‌ను తనిఖీ చేయగా.. సుమారు 150 రకాల నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసినట్లుతేలింది.  కంప్యూటర్‌‌‌‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకుని  పోలీసులకు అప్పగించినట్లు ఆర్ఐ తెలిపారు. ఈ దాడిలో రెవెన్యూ సిబ్బంది రెహమతుల్లా, జ్యోతి, బాలు తదితరులు పాల్గొన్నారు.