ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి   పూర్తి సహకారం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి   పూర్తి సహకారం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. శనివారం తాడూరు మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదల స్వగృహ కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని ప్రాధాన్యంగా అమలు చేస్తోందన్నారు.

లబ్ధిదారులు ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని పనులను మధ్యలో ఆపకుండా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణానికి సంబంధించిన బిల్లుల చెల్లింపులు ప్రతి సోమవారం విడుదల చేస్తున్నట్లు తెలిపారు.