భ‌ద్రకాళి చెరువుకు గండి..కాల‌నీల్లోకి నీరు

భ‌ద్రకాళి చెరువుకు గండి..కాల‌నీల్లోకి నీరు

రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు పొంగిపొర్లుతున్నాయి.  వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. దీంతో దిగువకు లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.  పలు చోట్ల చెరువులు, కుంటల కట్టలు తెగి రోడ్ల మీది నుంచి నీరు ప్రవహిస్తుండటంతో ఆయా మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. 

ఇటు వ‌రంగ‌ల్ భ‌ద్రకాళి చెరువుకు గండి ప‌డింది.  వ‌ర‌ద ఉదృతి పోటేత్తడంతో పోత‌న న‌గ‌ర్ వైపు ఉన్న క‌ట్ట తెగింది.  దీంతో చెరువులోని నీరంతా ఉదృతంగా బ‌య‌ట‌కు ప్రవహిస్తోంది. దీంతో భద్రకాళి చెరువు పరిసర కాలనీలైన   స‌రస్వతి న‌గ‌ర్, పోత‌న‌న‌గ‌ర్ తో పాటు..పాటు చుట్టు ఉన్న కాల‌నీల్లోకి నీరు వస్తోంది.  దీంతో అధికారులు అప్రమ‌త్తమ‌య్యారు. ఆయా కాల‌నీ వాసుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు.  అలాగే గండి పూడ్చడం కోసం  సిబ్బంది ప్రయత్నిస్తోంది.