వరంగల్‌‌‌‌ నగరంలో ఘటన...పెళ్లైన వ్యక్తితో ఇన్‌‌‌‌స్టా గ్రామ్‌‌‌‌ లో ప్రేమ.. యువతి సూసైడ్‌‌‌‌

వరంగల్‌‌‌‌ నగరంలో ఘటన...పెళ్లైన వ్యక్తితో ఇన్‌‌‌‌స్టా గ్రామ్‌‌‌‌ లో ప్రేమ.. యువతి సూసైడ్‌‌‌‌
  •     పెళ్లికి నిరాకరించడంతో బర్త్‌‌‌‌డే రోజే ఆత్మహత్య చేసుకున్న యువతి

వరంగల్ సిటీ, వెలుగు : ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించడం, అతడు పెండ్లికి నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వరంగల్‌‌‌‌ జిల్లాలో సోమవారం వెలుగుచూసింది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్‌‌‌‌ జిల్లా చెన్నారావుపేట మండలానికి చెందిన ఓ యువతి కుటుంబం వరంగల్‌‌‌‌ కొత్తవాడలో ఉంటూ కూలీపనులు చేస్తూ జీవిస్తోంది. బాలికకు అదే ఏరియాలో ఉండే వలభాను పృథ్వీరాజ్‌‌‌‌తో మూడేండ్ల కింద ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో తరచుగా కలుసుకోవడంతోపాటు ఫోన్లలో చాటింగ్‌‌‌‌ చేసుకునేవారు. ఈ క్రమంలో తనను పెండ్లి చేసుకోవాలని బాలిక పృథ్వీరాజ్‌‌‌‌ను అడుగుతుండడంతో మైనర్‌‌‌‌ కాబట్టి పెండ్లి చేసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతూ తప్పించుకునేవాడు. 

ఈ నెల 13న యవతి తన 18వ పుట్టిరోజు వేడుకలను నిర్వహించుకుంది. అనంతరం పృథ్వీరాజ్‌‌‌‌ను కలిసి తన మైనార్టీ తీరినందున పెండ్లి చేసుకోవాలని కోరింది. దీనికి ఒప్పుకోని పృథ్వీరాజ్‌‌‌‌ తనకు అప్పటికే పెండ్లి అయి, కొడుకు ఉన్నాడని చెప్పడంతో తిరిగి ఇంటికి వచ్చింది. రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్లావని తల్లిదండ్రులు మందలించడంతో జరిగిన విషయం మొత్తం చెప్పింది. తర్వాత అందరూ పడుకున్న తర్వాత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పృథ్వీరాజ్‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.