ముల్కనూర్ పీఎస్ ను సందర్శించిన సీపీ

ముల్కనూర్ పీఎస్ ను సందర్శించిన సీపీ

భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌‌ను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ బుధవారం సందర్శించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అర్రైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. రికార్డులను పరిశీలించి, హిస్టరీ షీట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ఎల్కతుర్తి సీఐ పులి రమేశ్, ఎస్సై రాజు పాల్గొన్నారు.