వరంగల్ బంద్.. స్కూళ్లు, కాలేజీలు మూసివేత

వరంగల్ బంద్.. స్కూళ్లు, కాలేజీలు మూసివేత

వరంగల్ బంద్ కు కాకతీయ యూనివర్శిటీ (కేయూ) విద్యార్థులు పిలుపునిచ్చారు. కేయూ పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని.. వాటిని పరిష్కరించాలని విద్యార్థులు చేసిన డిమాండ్లను పట్టించుకోకపోవడం లేదని కేయూ జేఏసీ విద్యార్థులు బంద్ కు పిలుపునిచ్చారు. విద్యార్థి జేఏసీ బందుకు కాంగ్రెస్, బీజేపీ మద్దతు తెలిపింది. 

Also Read : కేంద్రపాలిత ప్రాంతంగా ముంబై.. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యలు

కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఇచ్చిన బందు పిలుపు సందర్భంగా వరంగల్ లోని స్కూళ్లు, కాలేజీలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించారు. దీంతో వరంగల్ లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘనలు జరకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

కొనసాగుతున్న బంద్

ప్రస్తుతం వరంగల్ లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. వాణిజ్య, వ్యాపార సముదాయాల్లో రద్దీ కనిపించడం లేదు. బంద్ కు సహకరించాలని కేయూ జేఏసీ విద్యార్థులు కోరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు బంద్ కు మద్దతు తెలిపాయి.

పోలీసుల మోహరింపు

వరంగల్ బంద్ సందర్భంగా కాకతీయ యూనివర్శిటీ వద్ద పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ప్రవేటు కళాశాల బస్సులను కేయూ జేఏసీ స్టూడెంట్స్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కేయూ జేఏసీ విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. తాము శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నామంటున్నారు విద్యార్థి సంఘం నేతలు.