వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో తప్పిన ప్రమాదం

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో తప్పిన ప్రమాదం

వరంగల్ లోని కాకతీయ సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రి ఐదవ అంతస్థులో సీలింగ్, ఏసీ పరికరాలు ఒక్కసారిగా ఊడిపడ్డాయి. దీంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది ఉలిక్కిపడ్డారు. పిడియాట్రిక్ వార్డు ముందు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిర్మాణంలో నాణ్యత లోపం వల్లే ప్రమాదం జరిగిందని పలవురు ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.