
ప్రేమోన్మాది పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడిన డిగ్రీ విద్యార్థిని రవళి చనిపోయింది. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తన ప్రేమను తిరస్కరించిందని అవినాశ్ అనే యువకుడు… ఫిబ్రవరి 27న హన్మకొండలో అందరూ చూస్తుండగా పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రవళిని ముందుగా MGMకు తలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం….సికింద్రాబాద్ యశోదకు తరలించారు. ఆరు రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న రవళి పరిస్థితి విషమంగా ఉంది. మంటల్లో శ్వాసనాళాలు పూర్తిగా కాలిపోవటంతో ఊపిరితీసుకోవటం కూడా ఇబ్బందిగా మారింది. అయితే వెంటిలేషన్ సాయంతో డాక్టర్లు కృత్తిమ శ్వాస అందించారు.