ఈజీ మనీ కోసం అడ్డాదారులు తొక్కొద్దు

ఈజీ మనీ కోసం అడ్డాదారులు తొక్కొద్దు

ఆన్ లైన్ లో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముగ్గురిని వరంగల్  టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.20 లక్షల 80వేల 700 నగదు, కారు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు బుకీలు ఉన్నారు. వీరు గూగుల్ ప్లే స్టోర్ లోని క్రికెట్ బెట్టింగ్ యాప్ ద్వారా యువతను వలలో వేసుకుంటున్నారని పోలీసులు చెప్పారు. బెట్టింగ్ నిర్వహిస్తున్నందుకు బుకీలకు బెట్టింగ్ యాప్ ద్వారా 5 నుంచి 25 శాతం వరకు కమీషన్ వచ్చేదని తెలిపారు. ఈజీ మనీ కోసం క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు పోలీసులు.