పెండింగ్ చలాన్లకు..  నో డిస్కౌంట్

పెండింగ్ చలాన్లకు..  నో డిస్కౌంట్

హాసన్ పర్తి, వెలుగు :  పెండింగ్​ చాలన్లపై డిస్కౌంట్​ అంటూ సోషల్​ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్​ అని . అలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్లు నమ్మవద్దని వరంగల్, హనుమకొండ, ట్రాఫిక్​ పోలీసులు సూచించారు. సోషల్​ మీడియాలో వస్తున్న కథనాలపై   బుధవారం నాడు ప్రకటన విడుదల చేశారు.

పెండింగ్​ చలాన్లపై డిస్కౌంట్ల గురించి ఉన్నతాధికారుల నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ఉత్తర్వులు రాలేదని చెప్పారు అలాగే సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసి ప్రజలను గందరగోళానికి  గురి చేయవద్దని హెచ్చరించారు.