పద్మారావునగర్, వెలుగు: పారదర్శకత లేకపోవడం వల్లే జీహెచ్ఎంసీ వార్డుల డీ-లిమిటేషన్ పూర్తిగా తప్పులతడకగా మారిందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. శుక్రవారం అశోక్ కాలనీలో ఆయన పర్యటించారు. బస్తీ దవాఖానను ఆకస్మికంగా సందర్శించి, మందుల లభ్యత, ప్రతిరోజు వచ్చే రోగుల సంఖ్యపై వివరాలను డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బస్తీలోని రోడ్లపై అక్రమ వాహనాల పార్కింగ్, షెడ్ల నిర్మాణం వంటి సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. ట్రాఫిక్, -టౌన్ ప్లానింగ్ శాఖలు సమన్వయంతో పనిచేసి అక్రమాలన్ని తొలగించాలని ఆదేశించారు.
దివ్యాంగుల్ని కూడా మోసం చేసిన్రు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల్ని కూడా మోసం చేసిందని తలసాని ఆరోపించారు. శుక్రవారం అమీర్‌పేటలో జరిగిన దివ్యాంగుల దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎన్నికల ముందు రూ.6 వేల పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.

