సీడబ్ల్యూసీకి వార్దా ప్రాజెక్టు డీపీఆర్

సీడబ్ల్యూసీకి వార్దా ప్రాజెక్టు డీపీఆర్

 

హైదరాబాద్, వెలుగు: వార్దా ప్రాజెక్టు డీపీఆర్​ సీడబ్ల్యూసీకి గురువారం సబ్మిట్​చేశారు. డీపీఆర్ ​కాపీలను సీడబ్ల్యూసీ వెబ్​సైట్​లో అప్​లోడ్​చేసే ప్రక్రియ పూర్తయింది. ​ఫిజికల్ ​కాపీలను ఆదిలాబాద్ ​సీఈ శ్రీనివాస్​రెడ్డి  సీడబ్ల్యూసీలో శుక్రవారం అందజేయనున్నారు. రూ.4,874.87 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. నాలుగేండ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వార్దా నదికి అడ్డంగా 426 మీటర్ల పొడవు, సముద్ర మట్టానికి 155 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించనున్నారు. దీనికి 22 క్రెస్ట్ ​గేట్లు అమర్చుతారు. బ్యారేజీ నిర్మాణం, కాల్వల తవ్వకం, ఇతర పనుల కోసం మొత్తం 3,817.31 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. ఇందులో 3,076 ఎకరాలు తెలంగాణలో ఉండగా, మహారాష్ట్రలో 741.31 ఎకరాలు సేకరించాల్సి ఉంది. 11.50 టీఎంసీల నీటిని మళ్లించి 1,38,880 ఎకరాలకు నీళ్లిస్తారు. ఇంకో 5,868 ఎకరాలు స్థిరీకరించి  ఎల్లంపల్లికి నీటిని లిఫ్ట్​ చేయడానికి ఏడాదికి 123.41 మిలియన్ ​యూనిట్ల కరెంట్ ​వినియోగించాల్సి ఉంటుందని లెక్కగట్టారు. ప్రాజెక్టు వ్యయంలో రూ.వెయ్యి కోట్లు నదికి ఇరువైపులా కరకట్టలు నిర్మించడానికే ఖర్చవుతుందని ఇంజినీర్లు చెప్తున్నారు.