ఆన్‌లైన్ క్లాసులు ఆపాలంటూ టీచర్‌కు బెందిరింపులు

ఆన్‌లైన్ క్లాసులు ఆపాలంటూ టీచర్‌కు బెందిరింపులు

హైదరాబాద్: స‌సెప్టెంబ‌ర్ ఫ‌స్ట్ నుంచి అన్ని స్కూల్స్, కాలేజీల్లో ఆన్ లైన్ క్లాసులు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఆన్ లైన్ క్లాసుల‌పై కొంద మంది వ్య‌తిరేకిస్తుండ‌గా.. ఓ స్టూడెంట్ ఏకంగా టీచ‌ర్ కు ఫోన్ లో వార్నింగ్ ఇచ్చాడు. ఆన్ లైన్ క్లాసులు చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్ లో జ‌రిగింది. హిమాయ‌త్ న‌గ‌ర్ కు చెందిన ఓ టీచ‌ర్ లాక్‌డౌన్ కారణంగా కొన్ని నెల‌లుగా ఆన్‌లైన్‌లో క్లాసులు చెబుతోంది.

అయితే ఎవరో విద్యార్థి కావాలని ఫోన్ చేసి క్లాసులు ఆపకుంటే చంపేస్తామని టీచర్‌ను బెదిరించాడు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులకు టీచర్ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆన్ ‌లైన్ ‌లో క్లాసులు చెబుతున్న టీచర్‌కు చంపుతామని బెదిరింపులు రావడం కలకలం రేపుతున్నాయి. ఫోన్ నెంబ‌ర్ ఆధారంగా స్టూడెంట్ ను ప‌ట్టుకుంటామ‌ని తెలిపారు పోలీసులు.
పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.