కరోనాను వ్యాప్తి చేసినందుకు చైనా ఫైన్ కట్టాలె

కరోనాను వ్యాప్తి చేసినందుకు చైనా ఫైన్ కట్టాలె

వాషింగ్టన్: కరోనా వైరస్ చైనా నుంచే వచ్చిందన్న తన వాదన సరైందేనని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కరోనా చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి వచ్చిన వైరస్ అని.. అది నిజమైతే ప్రపంచానికి డ్రాగన్ కంట్రీ ఫైన్ కట్టాలని స్పష్టం చేశారు. ‘కరోనాను వ్యాప్తి చేసినందుకు చైనా ఫైన్ కట్టాలి. అమెరికాతోపాటు మిగిలిన వరల్డ్‌‌కు 10 ట్రిలియన్ డాలర్లను చైనా చెల్లించాలి. కరోనా మరణాలకు చైనాదే బాధ్యత’ అని ట్రంప్ పేర్కొన్నారు. చైనా వైరస్ వల్లే ప్రపంచవ్యాప్తంగా ఇంత మారణకాండ జరిగిందని ఫైర్ అయ్యారు.