జూబ్లీహిల్స్, వెలుగు: ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధరం కరం రోడ్, జీహెచ్ఎంసీ గ్రౌండ్ సమీప కేకే ఎన్ క్లేవ్ లో బాల్కనీలో ఉంచిన వాషింగ్ మెషీన్ గురువారం రన్నింగ్‌లో పేలిపోయింది. ఆ సమయంలో ఫ్లాట్‌లో నలుగురు కుటుంబసభ్యులు ఉన్నారు. వారు మెషీన్ కు దూరంగా ఉండటంతో ప్రమాదం తప్పింది.
పేలుడు ధాటికి మెషీన్లోపలి పార్ట్స్ఎగిరి సీలింగ్‌కు తగిలి కిందపడ్డాయని బాధితుడు వీఎస్ఆర్.శాస్త్రి తెలిపాడు. ఎల్జీ వాషింగ్ మెషీన్ కస్టమర్ కేర్ ను సంప్రదించగా స్పందించలేదని, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లోని ఇండ్లలోని ప్రజలు భయంతో బయటకు పరుగు తీశారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఎక్స్పర్ట్స్ఏమంటున్నారంటే...
వాషింగ్ మెషీన్ స్పిన్నింగ్( అధిక స్పీడ్) తిరగడం మూలంగా ఒక్కోసారి పేలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మెషీన్‌లోని ఫిల్టర్, బ్యాటరీ పేలే గుణం కలిగి ఉంటాయంటున్నారు. కొన్సిసార్లు మెషీన్లో ఓవర్ లోడ్, షార్ట్ సర్క్యూట్ వల్ల రన్నింగ్‌లో ఉండగాపేలిపోయే ఛాన్స్ఉంటుందంటుని పేర్కొంటున్నారు.
వాషింగ్ మెషీన్ డ్రమ్బేరింగ్స్ దెబ్బతిన్నప్పుడు, మెషీన్రన్నింగ్ లో ఉన్నప్పుడు గోడకు, ఇతర వస్తువులకు తగిలినప్పుడు కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మెషీన్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో లోపాలు కారణమా? లేక మెయింటెనెన్స్ సరిగా లేక బ్లాస్ట్జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది.
