చెట్టెక్కి గాల్లో డబ్బుల వర్షం కురిపించిన కోతి.. ఏకంగా రూ. రెండు లక్షలు గాల్లోనే...!

చెట్టెక్కి గాల్లో డబ్బుల వర్షం కురిపించిన కోతి.. ఏకంగా రూ. రెండు లక్షలు గాల్లోనే...!

ఉత్తరప్రదేశ్ లో ఓ కోతి గాల్లో డబ్బుల వర్షం వర్షం కురిపించింది... కోతి ఏమిటి... గాల్లో డబ్బుల వర్షం కురిపించడమేంటి అనుకుంటున్నారా...? అవును  వంద, వెయ్యి కాదు ఏకంగా రూ. రెండు లక్షలు. రూ. రెండు లక్షలు ఉన్న బ్యాగ్ తో చెట్టెక్కిన కోతి గాల్లోకి డబ్బులు విసిరేయడంతో ఎగబడ్డారు జనం. యూపీలోని బులంద్ షహర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో చోటు చేసుకుంది ఈ వింత ఘటన. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

కోర్టుకు వచ్చిన ఓ వ్యక్తి నుంచి సుమారు రూ. 2 లక్షల క్యాష్ ఉన్న బ్యాగ్‌ ను ఓ కోతి లాక్కెళ్లి, చెట్టుపైకి ఎక్కి నోట్లను కిందకు వెదజల్లింది. దీంతో అక్కడున్న జనం నోట్ల కోసం ఎగబడ్డారు. కచేరీ రోడ్డులోని స్టాంప్ ఆఫీసు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ లాయర్ తన సహోద్యోగి రవీంద్ర లోధి ( రాజు ) ని ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కోసం స్టాంపులు కొనేందుకు పంపించారు. రాజు డబ్బుల బ్యాగ్‌తో వెళ్తుండగా, ఓ కోతి అకస్మాత్తుగా ఆ బ్యాగ్‌ను లాక్కొని పక్కనే వేప చెట్టుపైకి ఎక్కింది.

చెట్టు కొమ్మపై కూర్చున్న కోతి, బ్యాగ్‌ను చించి అందులో ఉన్న రూ. 500 నోట్ల కట్టలను కిందకు విసిరేయడం స్టార్ట్ చేసింది. దీంతో అక్కడ 'డబ్బుల వర్షం' కురుస్తున్నట్టు కనిపించడం చూసిన జనం, కింద పడుతున్న నోట్లను ఏరుకునేందుకు ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సమాచారం అందుకున్న స్థానిక లాయర్లు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని.... దాదాపు రూ. లక్షా 91 వేల నగదును తిరిగి స్వాధీనం చేసుకుని యజమానికి అప్పగించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి బ్యాగ్ ను వదిలేసి వెళ్ళిపోయింది కోతి.

ALSO READ : ఇండియా వస్తున్న కాక్రోచ్ పార్టీ సృష్టికర్త అభిజీత్

ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఆహారం కోసమే కోతి బ్యాగ్‌ను లాక్కెళ్లి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కోతుల బెడద సాధారణమే కాగా, ఈ సంఘటనతో పట్టణ ప్రాంతాల్లో వన్యప్రాణుల నిర్వహణ మరోసారి హాట్ టాపిక్ గా మారింది.