శ్రీవారికి కానుకగా వచ్చిన వాచీల వేలం

శ్రీవారికి కానుకగా వచ్చిన వాచీల వేలం

ఫిబ్ర‌వ‌రి 10న వాచీల‌ ఈ – వేలం

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీల‌ను ఫిబ్ర‌వ‌రి 10 నుండి 12వ తేదీ వ‌ర‌కు ఈ- వేలం వేయ‌నున్నట్టు టీటీడీ సోమవారం ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది.  రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ వేలం వేయ‌నున్నారు. ఇందులో క్యాషియో, టైమెక్స్‌, ఆల్విన్‌, టైమ్స్, సొనాట, టిస్సాట్‌, ఫాస్ట్‌ట్రాక్ త‌దిత‌ర కంపెనీల వాచీలున్నాయి.

ఇందులో క్రొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం -128 లాట్లు  (ఇ.ఎ.నెం.20847, 20848, 20849, 20850, 20851 మరియు 20852 నెంబర్లు)  ఈ-వేలంలో ఉంచారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో కార్యాలయం వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరని కోరారు.