రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థినిలతో మసాజ్..వీడియో వైరల్

రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థినిలతో మసాజ్..వీడియో వైరల్

విద్యాబుద్దులు నేర్పించాల్సిన దేవాలయం లాంటి పాఠశాల్లో చేయకూడని పనులు.. విద్యార్థినులతో అసభ్యంగా డ్యాన్సులు.. ఇది చాలదన్నట్లు విద్యార్థినులతో పాఠశాల సిబ్బంది మసాజ్ లు..ఇంట్లో పనిచేయించడం వంటి చేయకూడని పనులన్నీ చేయించారు. బాధ్యతగా విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సి రెసిడెన్షి యల్ స్కూళ్లలో సిబ్బంది నిర్లక్షం, నిర్వాకానికి ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఒక ఉదాహరణ. జిల్లాలో కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థినులచేత మసాజ్ చేయించుకుంటున్న వాచ్ మెన్ నిర్వాకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. వివరాల్లోకి వెళితే.. 
    

ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లాలో ఓ రెసిడెన్షియల్ స్కూల్ కు చెందిన వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఈ వీడియోలో రెసిడెన్షియల్ స్కూల్ వాచ్ మెన్ విద్యార్థినులచేత మసాజ్ చేయించుకుంటున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు విద్యార్థినులతో కలిసి ఆ వాచ్ మెన్ డ్యాన్సులు చేస్తున్న మరో వీడియో బయటపడింది. ఈ ఘటన విద్యార్థుల భద్రత, క్షేమం గురించి ఆందోళనకు రేకెత్తిస్తోంది. 

అంతేకాకుండా వాచ్‌మెన్ తన ఫోన్‌లో విద్యార్థులకు అనుచితమైన వీడియోలను చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాఠశాల వార్డెన్ మాత్రం ఈ వీడియోల గురించి తమకు తెలియదని చెప్పుకొచ్చారు. 

వాచ్ మెన్ పై పలు ఆరోపణలు రావడంతో ప్రాథమిక విద్యా అధికారి (బీఈవో) విచారణ చేయడంతో ఆరోపణలు నిజమేనని తేలింది. అయితే ఇతర సిబ్బంది కూడా ఉన్నారని తేలింది. విద్యార్థినుల చేత మసాజ్ చేయించుకున్న వాచ్ మెన్ తోపాటు మిగతావారందిరిపై బీఈవో చర్యలకు సిద్దమయ్యారు. పూర్తి విచారణ జరిపాలని జిల్లా విద్యాశాఖాధికారికి తెలిపారు. ఇలాంటి ఘటనల జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

అయితే నెట్టింట్ వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు .. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు.  యోగీజీ  ఇలాంటి వారి ఇండ్లపైకి ఎప్పుడు బుల్డోజర్లు పంపిస్తారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. యోగీజీ యూపీలో విద్యా వైద్యం అదుపు తప్పింది.. ఆస్పత్రుల పరిస్థితి, పాఠశాలల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది.. యూపీలో ఏం జరుగుతోంది.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.