ఏపీ, తెలంగాణ జలాశయాలకు నీటి కేటాయింపులు

ఏపీ, తెలంగాణ జలాశయాలకు నీటి కేటాయింపులు

ఈ ఏడాది మే 31 వరకు రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణాలోని శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు నీటి కేటాయింపులపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీకి 84 TMCలు, తెలంగాణకు 140 TMCల నీటిని కేటాయిస్తున్నట్టు బోర్డు ఉత్తర్వుల్లో తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 84TMCలలో.. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు 4 TMCలు, హంద్రీ నీవా-మచ్చుమర్రి ఎత్తిపోతలకు 18TMCలు, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా 20 TMCలు, కుడి కాల్వ ద్వారా 42 TMCల నీటిని వినియోగించుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది.

తెలంగాణకు కేటాయించిన 140TMCలలో.. కల్వకుర్తి ఎత్తిపోతలకు 20TMCలు, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా 75TMCలు, ఏఎమ్మార్పీ, హైదరాబాద్ జలమండలి, మిషన్ భగీరథ ప్రాజెక్టుకు 45TMCల నీటిని వినియోగించుకునేందుకు అమనుమతినిచ్చింది కృష్ణానదీ యాజమాన్య బోర్డు.