వాటర్ బోర్డు ఎండీ ఆకస్మిక పర్యటన...ఖైరతాబాద్లో సీవరేజీ సమస్యల పరిశీలన

వాటర్ బోర్డు ఎండీ ఆకస్మిక పర్యటన...ఖైరతాబాద్లో సీవరేజీ సమస్యల పరిశీలన

హైదరాబాద్​సిటీ, వెలుగు: జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని నవీన్ నగర్ కాలనీ, ఆనంద్‌‌నగర్ ప్రాంతాల్లో సీవరేజీ సమస్యలను పరిశీలించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక డీ-సిల్టింగ్ చేపట్టాలని ఆదేశించారు. తరచూ ఓవర్‌‌ఫ్లో అయ్యే మ్యాన్‌‌హోల్స్​ను గుర్తించి రెడ్ మార్క్​ వేయాలన్నారు. కాగా, అధికారుల పరిశీలనలో 15 ఏండ్ల కింద నిర్మించిన ఒక డీప్ మ్యాన్‌‌హోల్ దెబ్బతిన్నట్లు గుర్తించి, సమస్య పరిష్కారానికి ఆదేశించారు. ఆపరేషన్ డైరెక్టర్ ప్రభు పాల్గొన్నారు.

నీటిని వృథా చేస్తున్న వ్యక్తికి ఫైన్​ 

ఖైరతాబాద్ పరిధిలో ఎండీ అశోక్ రెడ్డి విజిట్​చేస్తుండగా ఆనంద్ నగర్ కాలనీలో ఓ ఇంటిలో సంప్, ఓవర్‌‌హెడ్ ట్యాంక్ ఓవర్‌‌ఫ్లో కారణంగా తాగునీటి వృథా జరుగుతున్నదని గుర్తించారు. వెంటనే నోటీసు ఇచ్చి, రూ.10 వేల జరిమానా విధించారు.