అన్నారం పంప్ హౌస్ లోకి నీళ్లు

అన్నారం పంప్ హౌస్ లోకి నీళ్లు

కాళేశ్వరం ప్రాజెక్టులోని.. అన్నారం పంప్ హౌస్ లోకి నీళ్లు చేరాయి. చౌటపల్లి వాగు పొంగడంతో అన్నారం పంప్ హౌస్ లోకి నీళ్లొచ్చి చేరుతున్నాయి. ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే ప్రొటెక్షన్ వాల్ కట్టాల్సి ఉంది. కానీ.. ప్రొటెక్షన్ వాల్ ఇప్పటివరకు నిర్మించలేదని తెలుస్తోంది. పంప్ హౌస్ లోకి నీళ్లు వస్తుండటంతో.. వచ్చిన నీటిని ఎత్తిపోసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పంప్ హౌస్ లోకి వరద నీళ్ల విషయాన్ని బయటకు రాకుం జాగ్రత్త పడుతున్నారు అధికారులు. పంప్ హౌస్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.